మరో రికార్డ్ కు చేరువలో కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టులో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరే అవకాశముంది. వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ శతకాల ఘనతను కోహ్లీ సమం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌ లెజెండ్‌ రిచర్డ్స్‌ కెరీర్‌లో 24 శతకాలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 23 శతకాలతో ఉన్న సంగతి తెలిసిందే. ఓవల్‌లో అతడు మరో శతకం సాధిస్తే గనుక మాత్రం రిచర్డ్స్‌ సరసన నిలుస్తాడు. 70 టెస్టులు ఆడిన కోహ్లీ ఇప్పటి వరకు 54.44 సగటుతో 6098 పరుగులు చేయగా, రిచర్డ్స్‌ 121 టెస్టుల్లో 50.23 సగటుతో 8,540 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతం వీరోచిత ఫామ్‌లో ఉన్న విరాట్‌ శతకం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. తన 23 శతకాలతో విరాట్‌ కోహ్లీ అత్యధిక శతకాలు చేసిన వారి జాబితాలో 25వ స్థానంలో ఉన్నాడు.