వరల్డ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాదించిన షూటర్ సౌరభ్

వాస్తవం ప్రతినిధి: వరల్డ్ చాంపియన్ షిప్ లో షూటర్ సౌరభ్ చౌదరీ గోల్డ్ మెడల్ సాధించాడు. కొరియాలో జరుగుతున్న టోర్నమెంట్‌లో.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో.. షూటర్ సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 245.5 పాయింట్ల స్కోర్‌తో జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. గోల్డ్ గెలిచిన సౌరభ్‌ను కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రశంసించారు. ట్యాలెంట్, హార్డ్‌వర్క్‌తో మన కుర్రాళ్లు పతకాలు గెలుస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. అలానే 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనే అర్జున్‌సింగ్ చీమా కాంస్య పతకాన్ని సాధించాడు.