సెమీస్ కు దూసుకెళ్లిన జోకోవిచ్

Sep 5, 2018; New York, NY, USA; Novak Djokovic of Serbia reacts after being called for a time violation while serving against John Millman of Australia in a quarter-final match on day ten of the 2018 U.S. Open tennis tournament at USTA Billie Jean King National Tennis Center. Mandatory Credit: Jerry Lai-USA TODAY Sports

వాస్తవం ప్రతినిధి: యూ ఎస్ ఓపెన్ నుంచి స్విస్ క్రీడాకారుడు ఫెదరర్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే టోర్నీ లో ఆరవ సీడ్ నోవాక్ జోకోవిచ్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. విపరీతమైన వేడి వాతావరణంలో సాగిన మ్యాచ్‌లో జోకోవిచ్ 6-3, 6-4, 6-4 స్కోర్‌తో మిల్‌మాన్‌పై విజయం సాధించడం తో సెమీస్ కు దూసుకెళ్లాడు. 14వ సారి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలనుకుంటున్న జోకోవిచ్.. మూడవ సారి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఏడాది గాయం కారణంగా యూఎస్ ఓపెన్‌కు జోకోవిచ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 11 సార్లు సెమీస్‌కు చేరాడతను. నాలుగవ రౌండ్‌లో ఫెదరర్‌కు షాకిచ్చిన జాన్ మిల్‌మాన్‌ను జోకోవిచ్ ఈజీగా ఓడించాడు. సెమీస్‌లో అతను నిషికోరీతో తలపడనున్నాడు.