ఆ విషయంలో ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశాడుగా

వాస్తవం సినిమా: సాహో తదుపరి ప్రభాస్ తదుపరి చిత్రం త్రిభాష చిత్రంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తన త్రిభాష చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని – త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంకు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు. గోపీ కృష్ణతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రంను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో తనకు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.
‘సాహో’ చిత్రం డిసెంబర్ లేదా జనవరిలో చిత్రీకరణ పూర్తి అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం . ఒక వైపు సాహో చిత్రీకరణలో పాల్గొంటూనే మరో వైపు ప్రభాస్ తన తదుపరి చిత్రానికి 10 కేజీల వరకు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో కూడా తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రానుందో లేదంటే 2020 వరకు వేచి చూడాలో అంటూ ఫ్యాన్స్లో చర్చ మొదలైంది. మొత్తానికి తన తదుపరి చిత్రం గురించి స్వయంగా ప్రభాస్ ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.