పోలీసు వ్యవస్థపై విమర్శలు గుప్పించిన జేసీ

వాస్తవం ప్రతినిధి: ఎప్పుడూ రాజకీయాలు, రాజకీయ నేతలపై సెటైర్లు వేసే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి… తాజాగా పోలీసు వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. అనంతపురంలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం దెబ్బతింటోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల లాఠీ చావ చచ్చిపోయిందని అన్నారు. నేరగాళ్లకు పోలీసులు మర్యాదలు చేసే దుస్థితి నెలకొందని విమర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతోందని అన్నారు. జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.