విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తిని కరిచిన పాము

వాస్తవం ప్రతినిధి: విధి నిర్వహణ లో ఉన్న ఓ న్యాయమూర్తి పాము కాటుకు బలైన ఘటన కలకలం రేపుతోంది. ఊ ఘటన ముంబైలోజరిగింది. వివరాల ప్రకారం.. నవీ ముంబైలోని ఓల్డ్ పాన్వేల్, బందర్ రోడ్డులో ఉన్న పాత కోర్టు ఛాంబరులో జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సీపీ కషీద్ కూర్చుని ఉన్న వేళ ఈ ఘటన జరిగింది. తన విధుల నిర్వహణలో ఉన్న కషీద్ కుడి చేతిపై పాము కాటు వేసింది. వెంటనే ఆయన్ను కోర్టు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, కోలుకున్నారని తేల్చి నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. కషీద్ ను కరిచిన పాము విషపూరితం కాదని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ భుజ్ బల్ మీడియాకు తెలిపారు. పాత భవంతిలో కోర్టు ఉండటం, చుట్టూ పిచ్చిచెట్లు అధికంగా ఉండటంతోనే సర్పాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.