మాజీ సైనికాధికారి అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేసిన డ్యుటెర్టె

వాస్తవం ప్రతినిధి: తిరుగుబాటు చేసిన మాజీ సైనికాధికారి, ప్రతిపక్ష ఎంపి సెనేటర్‌ ఆంటోనియో ట్రిలేన్స్‌-4కు గతంలో మంజూరు చేసిన క్షమాభిక్షను రద్దు చేశారు ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన ఆంటోనియో ట్రిలేన్స్‌-4 మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డ్యుటెర్టె ప్రభుత్వం అమలు చేస్తున్న రాక్షస చట్టాలను ఖండిస్తున్నానని, అయితే అరెస్ట్‌ను ప్రతిఘటించబోనని చెప్పారు. ట్రిలేన్‌ క్షమాభిక్ష షరతులను ఉల్లంఘించినందున ఆయనకు మంజూరు చేసిన క్షమాభిక్షను రద్దు చేసే ఉత్తర్వులపై డ్యుటెర్టె గత వారం సంతకాలు చేశారని న్యాయశాఖ మంత్రి మెనార్డో గుయెవారా చెప్పారు.