పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రోడ్రిగో!

వాస్తవం ప్రతినిధి: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఆయన దేనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారంటే రెండేండ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు ఒబామాను తిట్టినందుకు డుటెర్టే ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఒబామాను వేశ్య కొడుకు అంటూ 2016 లో నోరు పారేసుకున్న నేపధ్యంలో ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఫిలిప్పీన్స్‌లో డ్రగ్స్ ముఠాల అణిచివేతను అమెరికా విమర్శించడంతో రోడ్రిగో అప్పట్లో తీవ్ర అసహనం వ్యక్తంచేయడమే కాక.. ఒబామాపై తిట్ల దండకం కురిపించిన సంగతి తెలిసిందే.  అయితే ఆదివారం నాలుగు రోజుల ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఫిలిప్పీన్స్ సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో రోడ్రిగో ఒబామాకు క్షమాపణలు చెప్పడం విశేషం.