‘శైలజా రెడ్డి అల్లుడు’ కోసం వస్తున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా?

వాస్తవం సినిమా: మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం రూపొందింది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మారుతి ఈ కథను మలిచాడు. ఆగస్టు 31న రావాల్సిన ఆ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడిపోయింది. అనేక తర్జన భర్జనల తర్వాత ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రిలీజ్ వారంలో గట్టిగా ప్రమోషన్లు చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబరు 9న పెద్ద ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించారు. ఆ వేడుకకు ఒకరికి ఇద్దరు ప్రముఖ కథానాయకులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ‘దేవదాస్’ సినిమాలో కథానాయకులుగా నటిస్తున్న అక్కినేని నాగార్జున.. నాని.
చైతూ హీరో కనుక నాగ్ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇక నాగ్ తో కలిసి నాని ‘దేవదాస్’ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే నాగ్ తో నానికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. గతంలో నానికి మారుతి ‘భలే భలే మగాడివోయ్’తో సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు కారణాలుగా .. మారుతి ఆహ్వానించగానే నాని ఓకే చెప్పేశాడట.