హాస్పిటల్ లో చేరిన దిలీప్ కుమార్!

వాస్తవం ప్రతినిధి: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ మళ్లీ హాస్పిటల్ లో చేరారు. ఛాతి ఇన్ఫెక్షన్ వల్ల అనారోగ్యం పాలవ్వడం తో ఆయనను ముంబైలోని లీలావతి హాస్పటల్‌ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం దిలీప్ కోలుకుంటున్నారని, ఆయనకు మీ ఆశీస్సులు కావాలని ఫైసల్ ఫారూకీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు. గత ఏడాది కూడా దిలీప్ అనారోగ్యం కారణంగా ఓ వారం రోజుల పాటు హాస్పిటల్ ఉన్న సంగతి తెలిసిందే. 1994లో దాదా సాహెబ్ ఫాల్కే, 2015లో పద్మ విభూషన్ అవార్డులను అందుకున్న ఆయన దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, కర్మా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతం అనారోగ్యం తో ఉన్న కారణంగా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.