తిరుపతి శ్రీ చైతన్య కళాశాల లో విద్యార్ధుల ఆందోళనలు

వాస్తవం ప్రతినిధి: తిరుపతి మల్లంగుంటలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులు ఆందోళన సృష్టించారు. కళాశాలలో సెల్ ఫోన్ మాట్లాడుతున్నా‌డ‌ని కోపంతో సురేంద్ర అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని వార్డెన్ చితకబాదడం తో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో విద్యార్థులు ఆగ్రహంతో కళాశాలలోని ఫర్నిచర్లను ధ్వంసం కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.