బుల్లితెర పై కరోడ్‌పతి షో.. 10వ సీజన్‌ ప్రారంభం

వాస్తవం సినిమా: కరోడ్‌పతి షో.. బుల్లితెర చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం. 2000 ఏడాదిలో ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు 9 సీజన్‌లు పూర్తి చేసింది. గత రాత్రి (సోమవారం) 9 గంటలకు బుల్లితెర పై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ క్విజ్ షో 10 వ సీజన్ సోనీ ఎంటర్‌ టైన్మెంట్ ఛానల్‌లో మొదలైంది.

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో అనగానే ముందుగా గుర్తొచ్చేది అమితాబ్‌బచ్చన్. ఈసారి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రసారమైన అన్ని సీజన్లల్లో ఒక్కటి మినహా అన్నింటికీ బిగ్‌బీనే హోస్ట్‌గా వ్యవహరించారు. ఒక్క సీజన్‌కి షారుఖ్ హోస్ట్‌గా వున్నారు.