తదుపరి సీజేఐ గా గోగోయ్ నియామకం లాంచనప్రాయం

వాస్తవం ప్రతినిధి: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నియామకం లాంఛనప్రాయమైనది. తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌ మిశ్ర కేంద్ర ప్రభుత్వానికి నేడు లేఖ రాసినట్లు తెలుస్తుంది. జస్టిస్‌ దీపక్‌ మిశ్ర అక్టోబరు 2న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజే అంటే అక్టోబరు 3న జస్టిస్‌ గొగొయ్‌ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాధారణంగా సుప్రీంకోర్టులో తన తర్వాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని తన వారసుడిగా సీజేఐ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ సంప్రదాయం ప్రకారమే తదుపరి సీజేఐ పేరు సిఫార్సు చేయాల్సిందిగా ఇటీవల న్యాయ మంత్రిత్వ శాఖ జస్టిస్‌ మిశ్రకు లేఖ రాసిన నేపధ్యంలో జస్టిస్‌ గొగొయ్‌ పేరును ప్రతిపాదిస్తూ న్యాయశాఖకు ప్రతిలేఖ రాశారు. దీంతో జస్టిస్ గొగొయ్‌ నియామకం ఇక లాంఛనప్రాయమైంది.