కాంగ్రెస్ ర్యాలీ లో యాసిడ్ దాడి….30 మంది కార్యకర్తలకు గాయాలు

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ ర్యాలి లో యాసిడ్ దాడి చోటుచేసుకుంది. స్థా‌నిక సంస్థ‌ల ఎన్ని‌క‌ల్లో విజ‌యం సాధించిన సంద‌ర్భంగా బెంగుళూరు లోని తుంకూరులో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ర్యా‌లీ నిర్వ‌హించారు. అయితే ఈ ర్యా‌లీలో ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు యాసిడ్ దాడికి పాల్ప‌డ్డా‌రు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 30 మంది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలైనట్లు తెలుస్తుంది. యాసిడ్ దాడిలో బీజేపీలో ప్ర‌మేయం ఉంద‌న్న కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టా‌రు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.