చైనా లో వరదలు…..5 గురు మృతి!

వాస్తవం ప్రతినిధి: చైనాలో సంభవించిన అకస్మాత్తు వరదలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వరదల కారణంగా మరో 16 మంది జాడ తెలియరాలేదని అధికారులు తెలిపారు. చైనాలోని యున్నాన్‌ ప్రావిన్స్‌లో ఈ వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో మెంగ్‌డాంగ్‌ టౌన్‌షిప్‌ అతలాకుతలం అయింది. వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు గాయపడడమే కాకుండా చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు అందకారంలో మునిగిపోయారు.  మెటియోరాజికల్‌ అధికారులు ఎమెర్జిన్సీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే భద్రతా బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది.