‘గురుశ్రీ’ పురస్కారం అందుకున్న ‘హాస్యబ్రహ్మ’

వాస్తవం సినిమా: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం‘గురుశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గురుశ్రీ పురస్కారాన్ని అందించిన అసోసియేషన్ ‘హాస్యబ్రహ్మ’కు స్వర్ణకంకణ ధారణ చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఆదిపరాశక్తి కుమారులే త్రిమూర్తులని పేర్కొన్నారు. వీరిలో సృష్టించేవాడు (జనరేటర్) బ్రహ్మ అయితే, నడిపించే వాడు (ఆర్గనైజర్) విష్ణువని, ఇక తీసుకెళ్లేవాడు (డిస్ట్రాయర్) శివుడని, ఈ ముగ్గురినీ కలిపి దేవుడు (జీవోడీ-గాడ్) అంటారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖలు పాల్గొన్నారు.
వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మ్ పద్మ పురస్కారాన్నిసైతం అందుకున్నారు.