చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్…..నలుగురు నక్సలైట్లు మృతి!

వాస్తవం ప్రతినిధి: చత్తీస్ గడ్ లోని నారాయణపూర్‌ జిల్లాలో ఆదివారం ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తుంది. చత్తీస్ గడ్ కోక్‌జర్హర్‌ సమీపంలోని అటవీప్రాంతంలో పోలీసులు గాలిస్తుండగా నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. దీనితో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడం తో  నలుగురు నక్సలైట్లు మృతిచెందగా, ఆప్రాంతం నుండి ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, 2016లో 135 నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా, 2017లో 77మంది నక్సలైట్లు మృతి చెందారని, ఈ ఏడాది 40మంది మృతిచెందినట్లు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.