చిన్ని కృష్ణుడి వేషధారణలో నారా దేవాన్ష్..

వాస్తవం ప్రతినిధి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఈ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ ‘చిన్ని కృష్ణులు’ సందడి చేస్తున్నారు. తమ ఇంట్లోనూ ఓ బాలకృష్ణుడున్నాడంటూ ఏపీ మంత్రి లోకేష్‌ ఇవాళ ఓ ట్వీట్‌ చేశారు, కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఈ సందర్బంగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. తన కుమారుడు దేవాన్ష్ చిన్ని కృష్ణుడి వేషధారణలో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో ఉంచారు. ‘గిరిని సైతం గోటితో లేపినా, తులసీ దళానికే తేలిపోయాడట! ఆయుధం పట్టలేదు కానీ అసుర సంహారం ఆపలేదట! అందరికీ ఆదర్శప్రాయమైన ఆ శ్రీ కృష్ణ భగవానుని స్మరిస్తూ, తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు!’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.