ఏపీలో “పవన్ మానియా”…ఆదర్శవంతంగా “పవన్ ఫ్యాన్స్”..!!!

 వాస్తవం ప్రతినిధి : పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే చాలు యువకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం, యువత పూనంకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉంటారు. పార్టీలకి, కుల మతాలకి  అతీతంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానులు అందరూ పవన్ పై ఎనలేని, అంతులేని  ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు..పవన్ కళ్యాణ్ నడిచే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు..పవన్ కళ్యాణ్ కి ఉన్న ముక్కు సూటి తనం , న్యాయం కోసం ఎంతకైనా సరే తెగించే ధైర్యం , ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనస్తత్వం, అనాధాలు ,నిరాశ్రయులు పట్ల పవన్ కళ్యాణ్ చూపించే ఔదార్యం ఇలా ప్రతీ విషయంలో పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు ఆదర్శవంతంగా తీసుకుంటారు..ఆయన బాటలోనే నడుస్తారు..అందుకే

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని ఆయన అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు . కేవలం ఒక్క ఏపీలోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు,  కేరళలో , విదేశాలలో సైతం పవన్ పుట్టిన రోజుని ఎంతో ఘనంగా నిర్వహించారు..ఎదో తూ తూ మంత్రంగా అందరిలా చేశాము అనే పేరుకి మాత్రం చేయలేదు పవన్ పుట్టిన రోజు కి దాదాపు కొన్ని రోజుల ముందుగానే భాదితులని గుర్తించడం..తల్లి తండ్రులు లేని చిన్నారులకి ఆశ్రయం కలిపిస్తున్న ఆశ్రమాలకి వెళ్ళడం..ముందుగానే వారితో మాట్లాడి వారు చేసే సాయం నేరుగా భాదితులకి వెళ్ళేలా అంతా ఒక పక్కా ప్రణాళికగా చేయడం జరిగింది..

ముఖ్యంగా ఏపీలో పవన్ సొంత జిల్లా అయిన పశ్చిమలో పవన్ జన్మదిన వేడుకలు మిన్నంటాయి. అనాధ పిల్లలలకి స్కూల్ బ్యాగ్ లు అందచేయడం , వృద్ధులకి చీరలు , పంచెలు పంచడం , రక్త దానం చేయడం , ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏక కాలంలో భాదితులందరికి పవన్ అభిమానులు పార్టీ కార్యకర్తల దగ్గరుండి మరీ సేవా కార్యక్రమాలని పర్యవేక్షించారు…అంతేకాదు యువత మొత్తం స్వచ్చందంగా ఈ వేడుకల్లో  పాల్గొన్నారు…అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే రాజకీయ నేతగా మారిన తరవాత పవన్ కళ్యాణ్  క్రేజ్ మరింత పెరిగిపోయింది..అంతేకాదు సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తోన్న జనసేనానికి జనసైనికులు, అభిమానులు అందరూ  అండగా ప్రతీ విషయంలోనూ అండగా నిలుస్తున్నారు కష్టంలోనూ సుఖంలోనూ వెన్నంటే ఉంటున్నారు అనడానికి నిన్నజరిగిన పుట్టిన రోజు వేడుకలే నిదర్సనం..అయితే

భారత దేశ ట్విట్టర్ చరిత్రలో పవన్ కళ్యాణ్ ఒక రికార్డ్ సృష్టించారు బహుశా ఆ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి..అదేంటంటే కేవలం 24 గంటల్లో 74 లక్షలకు పైగా ట్వీట్లు పవన్ పుట్టినరోజుపై చేశారు. అలాగే 1 మిలియన్ నుంచి 7 మిలియన్ల వరకు ప్రతి మిలియన్‌ ట్వీట్లను అత్యంత వేగంగా చేసి చరిత్ర సృష్టించారు..అయితే యువత పలు సేవా కార్యక్రమాలూ ఎంతో చురుకుగా పాల్గొని ఎంతో మందికి సేవలు చేయడం ఆదర్శవంతంగా ఉందని, ఈ రకమైన కార్యక్రమాల వలన ప్రజలలో పవన్ పట్ల పవన్ పార్టీ జనసేన పట్ల విశ్వాసం, నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉందని  విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.