సింధియా ను షూట్ చేస్తా అంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు

వాస్తవం ప్రతినిధి: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, ఎంపీ జ్యోతిరాధిత్య సింథియాను షూట్ చేస్తాను అంటూ ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఉమా దేవి కుమారుడు లాల్‌చంద్ కాథిక్ వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో అతను ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. జ్యోతిరాధిత్య సింథియా.. నీ నరాల్లో ఝాన్సీ రాణిని చంపిన జివాజీరావు రక్తం ప్రవహిస్తున్నది, నువ్వు హత్తాకు వస్తే, నిన్ను షూట్ చేస్తానంటూ ఎమ్మెల్యే కుమారుడు తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు.

మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. హతా జిల్లాలో సెప్టెంబర్ 5వ తేదీన సింథియా టూర్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సింథియాకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. అయితే తన కుమారుడు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టుపై ఎమ్మెల్యే ఉమా దేవి స్పందిస్తూ…ఇది ఎంతో దురదృష్టకరమని, సింథియా గౌరవనీయమైన ఎంపీ అని, ఎఫ్‌బీ నుంచి ఆ పోస్టును తీసివేయాలని తన కుమారుణ్ణి కోరనున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు.