కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి నిండు మనసుతో ప్రజలు బలపరచాలి : కడియం శ్రీహరి

వాస్తవం ప్రతినిధి: దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కొంగరకలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడారు. రైతును రాజును చేయాలనే సంకల్పంతో పంట రుణాలను మాఫీ చేశారని, రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచారని అన్నారు.

వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కంటి వెలుగు, కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా మరెన్నో పథకాలను కేసీఆర్ అమలు చేశారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి నిండు మనసుతో ప్రజలు బలపరచాలని కడియం శ్రీహరి కోరారు.