వాద్రా పై ఎఫ్ ఐ ఆర్ నమోదు

వాస్తవం ప్రతినిధి: యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు తెలుస్తుంది. భూ కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సురేందర్‌ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో వాద్రాతోపాటు హరియాణా మాజీ సీఎం భపిందర్‌ సింగ్‌ హుడాపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. డీఎల్‌ఎఫ్‌, ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ సంస్థల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు.