ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం…ఒకరు మృతి!

వాస్తవం ప్రతినిధి: రష్యా లో బోయింగ్ విమానం విచిత్రంగా ప్రమాదానికి గురైంది. రష్యాలోని సోచి విమానాశ్రయంలో దిగబోతున్న బోయింగ్ విమానం రన్‌వే నుంచి పక్కకు జారి నదీ తీరంలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఒక సూపర్‌వైజర్‌ మృతిచెందగా, 164 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తుంది.