పవన్ కల్యాణ్ కు చిరంజీవి ఆశీస్సులు

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు.
‘కల్యాణ్ బాబు!!!! నువ్వు అందుబాటులో లేవని తెలిసింది, కలవాలని అనుకుని విరమించాను. పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆ హనుమాన్, నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని మరియు మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ కు చిరంజీవి ఆశీస్సులు అందజేశారు.