అంతర్జాతీయ చదరంగం క్రీడాకారుడు స్నేహిత్ హఠాన్మరణం 

వాస్తవం ప్రతినిధి: అంతర్జాతీయ చదరంగం క్రీడాకారుడు.. ఫిడే రేటింగ్‌ సాధించిన మొట్టమొదటి జిల్లా చెస్‌ ఆటగాడు స్నేహిత్‌ (28) ఆగస్టు 29న హఠాన్మరణం చెందారు. పలు అంతర్జాతీయ దివ్యాంగ పోటీలతో పాటు, ఆన్‌లైన్‌ చదరంగం పోటీలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన ఆయన ఈ నెల 29 న మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన రవీందర్‌కుమార్, భూగర్భ జల వనరుల శాఖ అధికారి రమాదేవిల కుమారుడు. పుట్టుకతో వచ్చిన వెన్నెముక సంబంధిత హైడ్రోకెఫాలస్‌తో బాధపడుతూ మూడు చక్రాల కుర్చీకి పరిమితమైనప్పటికీ తాను అమితంగా ఇష్టపడే చదరంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా మెదడుకు ఎన్నో శస్త్రచికిత్సలు చేసినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదరంగంపై పట్టు సాధించారు. 2003 నుంచి చదరంగంలో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్నారు. తండ్రి రవీందర్‌ కుమారుడి పరిస్థితిని చూసి తన ఉద్యోగాన్ని వదులుకుని రూ.లక్షలు పెట్టి వెన్నెముక, మెదడుకు ఆరుసార్లు శస్త్రచికిత్సలు చేయించారు. ఏళ్లపాటు కుర్చీకే పరిమితమైన స్నేహిత్‌ ఆగస్టు 29న హఠాన్మరణం చెందారు.