నిస్వార్ధంగా ఉండటంలో ఈ తరానికి పవన్ ఓ ఉదాహరణ : సమంత

వాస్తవం సినిమా: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని పవన్ కు ట్విట్టర్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. పవన్ కల్యాణ్ నిస్వార్ధపరుడనీ, ఈ తరానికి రోల్ మోడల్ అని సమంత వ్యాఖ్యానించింది.

‘ప్రియమైన పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిస్వార్ధంగా ఉండటంలో ఈ తరానికి పవన్ ఓ ఉదాహరణ. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ కు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.