‘యాత్ర’ ఫస్ట్ సాంగ్ విడుదల

వాస్తవం సినిమా: ఈ రోజు దివంగత నేత రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ‘యాత్ర ‘సినిమా యూనిట్ ‘సమర శంఖం’ అనే పాటను లిరిక్స్ తో విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజశేఖరరెడ్డి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు.ఇందులో వైఎస్సార్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టి వేలాది కార్యకర్తలతో కలసి పాదయాత్రలో ముందుకు దూసుకుపోతున్నాడు.ఈ సినిమాకు మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించగా, కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వైఎస్సార్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, అందుకే దీనికి ‘యాత్ర’ అనే టైటిల్‌ను పెట్టామని దర్శక నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. యాత్రను 2019, జనవరిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.