చంద్రబాబు బయోపిక్‌.. ఫస్ట్‌లుక్‌ ఇదే!

వాస్తవం సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది . ఈ చిత్రానికి వెంకట రమణ దర్శకుడు. జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు.
చంద్రబాబుగా వినోద్‌ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్‌ నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ పీఆర్‌ బాణీలు అందిస్తున్నారు. సినిమాకు ‘చంద్రోదయం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రచార చిత్రంలో చంద్రబాబును చూపించారు.
ఈ సందర్బంగా దర్శకుడు వెంకట రమణ మాట్లాడుతూ ‘ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ 80 శాతం పూర్తయింది. దేశచరిత్రలోనే ఒక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీస్తున్నాం. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం.. ఇప్పటికే చంద్రోదయం సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.అక్టోబరు 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము ‘అని ఆయన పేర్కొన్నారు.