‘వారందరి ప్రేమ, అపార శక్తి మీకు ఉంటుంది”: అల్లు అర్జున్

వాస్తవం సినిమా: నేడు తమ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ ఓ పండుగలా వైభవంగా జరుపుకుంటుండగా, అల్లు అర్జున్ తన బాబాయ్ కి ట్విట్టర్ వేదికగా శుభాభినందనలు చెప్పాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ లగ్జరీ లైఫ్ ను వదిలేసి, సమాజం కోసం ఆయన పోరాడుతున్నారని బన్నీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ బాబాయ్. మీకు ఓ సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ, ఒక మంచి సమాజం కోసం పోరాటం చేస్తూ… మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను నేను ఆరాధిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కృషి కొన్ని లక్షల హృదయాలను గెలుచుకుంది. వారందరి ప్రేమ, అపార శక్తి మీకు ఉంటుంది” అని అన్నాడు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, హీరో, హీరోయిన్లు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.