కాంగ్రెస్ చీఫ్ పై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి అశ్విన్‌ కుమార్‌ చూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందం నేపథ్యంలో రాహుల్ విమర్శలు గుప్పిస్తున్న నేపధ్యంలో ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చూబే వ్యాఖ్యానించారు. బిహార్‌లోని ససరాంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఫ్రాన్స్‌తో రాఫెల్‌ డీల్‌పై ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్‌ చేస్తున్న దాడి అర్ధరహితమని అన్నారు. ఆకాశం వంటి సమున్నత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్న రాహుల్‌ను మానసిక వ్యాధుల ఆస్పత్రిలో చేర్చాలని ఆయన విమర్శించారు.