అమెరికా బయలుదేరి వెళ్లిన కేరళ సీఎం

వాస్తవం ప్రతినిధి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అమెరికా బయలు దేరినట్లు తెలుస్తుంది. వైద్య చికిత్స  నిమిత్తం ఈ రోజు ఉదయం అమెరికా బయలుదేరి వెళ్ళినట్లు సమాచారం. ఆయన తో పాటు ఆయన భార్య కమల కూడా ఉన్నట్లు తెలుస్తుంది. న్యూయార్క్‌లోని రోచెస్టెర్‌లో ఉన్న మయో క్లినిక్‌లో చికిత్స తీసుకోనున్నారు. ‘ఆయన తిరిగి కేరళకు ఎప్పుడు వస్తారన్న విషయాన్ని మేము ఇప్పుడే చెప్పలేం. వైద్యులు చేసే సూచనల మేరకు ఆయన అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. అయితే ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారన్న విషయం మాత్రం తెలియరాలేదు.