ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్ జట్టు

వాస్తవం ప్రతినిధి: భారత్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 12.1వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతిని ఎదుర్కొన్న కుక్‌(12) స్లిప్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ తర్వాత 15.4వ ఓవర్‌లో ఇషాంత్‌ శర్మ వేసిన బంతిని ఎదుర్కొన్న మొయిన్‌ అలీ(9) కేఎల్‌ రాహుల్‌కే క్యాచ్‌ ఇచ్చి ఔటవ్వడం తో ఈ  సిరీస్‌లో ఇప్పటి వరకు రాహుల్‌ 11 క్యాచ్‌లు పట్టాడు. ఒక సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌(10)ను కేఎల్‌ రాహుల్‌ అధిగమించాడు. 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే రాహుల్‌ ద్రవిడ్‌ 10 క్యాచ్‌లు పట్టాడు. మరో పక్క ఇంగ్లాండ్‌ ఏడు పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 17 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెన్నింగ్స్‌ (13), రూట్‌ ఉన్నారు.