‘దగ్గరగా రావా’ అంటూ యాడ్ లో తళుక్కున మెరిసిన సూపర్ స్టార్

వాస్తవం సినిమా: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో జోరు మీదున్నాడు. ఇదే సమయంలో పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా క్లోజ్ అప్ టూత్ పేస్ట్ యాడ్ లో తళుక్కున మెరిశాడు. ‘దగ్గరగా రా.. దగ్గరగా రా.. దగ్గరగా రావా’ అంటూ తన అందంతో యాడ్ కు మరింత ఆకర్షణను జోడించాడు. రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న మహేష్ ఓ ముద్దుగుమ్మతో కలసి నటించిన ఈ యాడ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.