కోరుకున్న ప్రియుడు వికాస్‌ తో సైలెంట్ గా స్వాతి వివాహం

వాస్తవం ప్రతినిధి: హీరోయిన్ కలర్స్ స్వాతి వివాహం కోరుకున్న ప్రియుడు వికాస్‌ తొ జరిగింది.వీళ్ల ప్రేమకు పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఎటువంటి హంగామా లేకుండానే వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి (ఆగస్టు 30న) హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, మరి కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలెవరూ లేకుండానే వివాహ మహోత్సవాన్ని ప్రయివేట్ వేడుకగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 2న కొచ్చిలో స్వాతి – వికాస్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. అక్కడినుంచి వచ్చిన తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో స్పెషల్‌గా రిసెప్షన్ ఇవ్వనున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. పెళ్లయిపోవడంతో స్వాతి మలేషియాలోనే సెటిల్‌కానుంది. వికాస్ ప్రస్తుతం మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌‌గా పని చేస్తున్నాడు.