నాలుగోసారి చిదంబరాన్ని విచారించిన ఈడీ అధికారులు

వాస్తవం ప్రతినిధి: ఎయిర్‌సెల్‌- మ్యాక్సిస్‌ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం మరోసారి విచారించినట్లు తెలుస్తుంది. ఈడీ అధికారులు చిదంబరాన్ని ఈ విధంగా విచారించడం ఇది నాలుగోసారి. ఆయన చెప్పిన వివరాలను అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎల్‌ఎంఏ)లోని నిబంధనలకు అనుగుణంగా నమోదు చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత ఆగస్టు 24న దాదాపు ఆరుగంటల పాటు విచారించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా విదేశీ పెట్టుబడుల విషయంలో ఎయిర్‌సెల్‌- మ్యాక్సిస్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదరగా, ఇందులో సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.