కీలక నిర్ణయాలు తీసుకోనున్న తెలంగాణ కేబినెట్

వాస్తవం ప్రతినిధి: సెప్టెంబర్‌ 2న మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. అదే రోజు కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ జరగనుంది. ఈ సభ ప్రారంభానికి ఒక గంట ముందు మంత్రివర్గం భేటీకానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం రద్దుపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ ఉత్కంఠ రేపుతోంది.