“ప్రభాస్” కీలక పాత్రలో…“అంబానీ” నిర్మాతగా….“1000 కోట్ల” భారీ బడ్జెట్ సినిమా..

వాస్తవం సినిమా:  ప్రభాస్ ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది బాహుబలి..ఆరడుగుల నిలువెత్తు మనిషి..హాలీవుడ్ హీరోలకి ధీటుగా చూడచక్కని రూపంతో హీరో అంటే ఇలా ఉండాలి అనుకునే విధంగా ప్రభాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. .బాహుబలి రికార్డులు ఇప్పటి వరకూ ఏ ఒక్క సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు బాహుబలి ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించిందో..అయితే ఇప్పుడు ఈ రికార్డులని బ్రేక్ చేసేవిధంగా బాహుబలి సినిమాకంటే ధీటుగా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు..

Related image

అనిల్ అంబాని నిర్మాతగా..దాదాపు “1000 కోట్ల” తో భారీ బడ్జెట్ సినిమాని తీయడానికి ప్రణాలికలు సిద్దం చేసి ఉంచారు..ఇంతకీ ఆ సినిమా పేరు “మహాభారత్” అంతేకాదు ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ మరియు అంబాని కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నారట..ఈ సినిమాతో ప్రభాస్ ని బాలీవుడ్ లో డైరెక్ట్ గా పరిచయం చేయడానికి సిద్దమవుతున్నారు అంబాని..అయితే అమీర్‌ఖాన్ కూడా ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ పై ఆశక్తి చూపిస్తున్నా సరైన మార్గం లేకపోవడంతో మధ్యలోనే సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఏకంగా రిలయన్స్ అధినేత కూడా తోడు ఉండటంతో

Image result for prabhas mahabharata

అమీర్ తన డ్రీం ప్రాజెక్ట్ ని నిజం చేసుకునే సమయం దగ్గర పడిందని చెప్పవచ్చు..మహాభారత్ ను ” గ్రాండ్ ఫీస్ట్” గా నిర్మించటానికి లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేం ఆఫ్ ది థార్న్స్ లాంటి హాలీవుడ్ చిత్రాల నిర్మాణ స్థాయిలో, అత్యద్భుత సాంకేతిక సాహిత్య విలువలతో నిర్మించటానికి ఇప్పటికే కీలక చర్చలు జరిగాయని అంటున్నారు..అయితే ఈ భారీ చిత్రానికి నటులని ఎంపిక చేయడానికి కసరత్తులు కూడా జరుగనన్నాయట..అయితే అమీర్‌ఖాన్ కృష్ణుడిగా అర్జునిడిగా ప్రభాస్ ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది..