చర్చలు ఆగిపోవచ్చు అన్న ఉత్తర కొరియా

వాస్తవం ప్రతినిధి: కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధ నిరాయిధీకరణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రారంభించిన చర్చలు ఆగిపోవచ్చని ఉత్తర కొరియా పేర్కొంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ కార్యదర్శికి ఉత్తర కొరియా లేఖ రాసినట్లు సిఎన్‌ఎన్‌ వార్త సంస్థ పేర్కొంది. అమెరికా ప్రభుత్వ కార్యదర్శి మైక్‌ పొంపేకు నేరుగా రాసిన లేఖలో ”చర్చల్లో మళ్లీ ప్రతిష్ఠంబన ఏర్పడింది. పూర్తిగా ఆగిపోవచ్చు” అని ఉత్తర కొరియా ప్రభుత్వం పేర్కొంది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు కావాల్సిన చర్యలను తీసుకోవడంలో అమెరికా ప్రభుత్వ వైఖరి అంచనాలకు తగ్గినట్లుగా లేదని పేర్కొంది. ఉత్తర కొరియా పర్యటనను మైక్‌ పొంపే రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించిన వెంటనే ఉత్తర కొరియా ప్రభుత్వం నుండి ఈ లేఖ వచ్చినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక పేర్కొంది.