మే డ్యాన్స్ పై విమర్శలు చేసిన నెటిజన్లు

వాస్తవం ప్రతినిధి: ఇటీవల దక్షిణాఫ్రికా లో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.  అయితే ఇప్పుడు ఆ డ్యాన్స్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆమె రోబో లాగా డ్యాన్స్ చేస్తున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా కొంత మంది డ్యాన్స్ చూడడానికి చాలా అసహ్యంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాల వృద్ధి లక్ష్యంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న థెరిస్సా మే,ఈ పర్యటన సందర్భంగా ఆమె కేప్‌టౌన్‌లోని హైస్కూల్‌ను సందర్శించారు. అక్కడ ఆమె విద్యార్ధులతో కలిసి కాసేపు సెప్టులేశారు. ఆ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. డ్యాన్స్‌లో ఆమె వేసిన కొన్ని స్టెప్స్‌ను విమర్శిస్తూ పలువురు ట్వీట్లు చేశారు. విద్యార్దులతో డ్యాన్సు చేయడంలో మే మన:స్ఫూర్తిగా పాల్గొనలేదని, ఆమెలో స్వేచ్చగా కదిలే గుణాన్ని ఎవరో ఆపరేషన్‌ చేసి తొలగించినట్లుగా ఉందంటూ మరికొందరు నెటిజన్లు ఎగతాళి చేశారు. తమ జీవితంలోనే ఇంతటి చెత్త డ్యాన్సును ఎప్పుడూ చూడలేదంటూ మరికొందరు ట్వీట్‌ చేశారు.