యూ ఎస్ ఓపెన్ లో ఆసక్తికర మైన పోరు

వాస్తవం ప్రతినిధి: యూఎస్‌ ఓపెన్‌లో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో మూడో రౌండ్లో అక్కాచెల్లెళ్లు అయిన టెన్నిస్ క్రీడాకారిణి లు సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్  ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. రికార్డు స్థాయిలో 24వ సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా విలియమ్స్‌ రెండో రౌండ్లో 6-2, 6-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి కరినా వితాఫ్ట్‌పై విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టగా, మరోపక్క ఇటలీ క్రీడాకారిణి కమిలా జియార్జిపై 6-4, 7-5తో విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది వీనస్‌‌. దీంతో మూడో రౌండ్లో వీరిద్దరే ప్రత్యర్థులుగా తలపడనున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడటం ఇది 30వ సారి. ఇప్పటి వరకు వీరిద్దరూ 29 సార్లు ప్రత్యర్థులుగా తలపడగా సెరెనా 17 సార్లు…వీనస్‌ 12 సార్లు విజయం సాధించారు. గత ఏడాది బిడ్డకు జన్మనిచ్చి తిరిగి టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన సెరెనా ఈసారి అక్కపై పైచేయి సాధిస్తుందో లేదో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.