అజర్ బైజాన్ వెళ్ళబోతున్న చరణ్

వాస్తవం సినిమా: రంగస్థలం సూపర్ హిట్ తరువాత రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. ఇప్పుడు షూటింగ్ కోసం తూర్పు ఐరోపా దేశమైన అజర్ బైజాన్ వెళ్ళబోతున్నది. తూర్పు ఐరోపా దేశాల్లో అజర్ బైజాన్ పెద్ద దేశం. అంతేకాదు అక్కడ అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుపుకోబోతున్నది. 30 రోజులపాటు అజర్ బైజాన్ కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట.

మగధీరుడుకి జంటగా భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నది. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.