వెండితెరపై ‘మహానటి’ సంచలనం

వాస్తవం సినిమా:వెండి తెరపై ‘మహానటి’ సినిమా సంచలనం సృష్టించింది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితచరిత్రను ‘మహానటి’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ ఈ సినిమా 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తరువాత రానున్న బయోపిక్ లకు ఈ సినిమా ఒక కొలమానంగా నిలిచింది. కీర్తి సురేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది.
మహానటి సినిమాను ‘స్టార్ మా’ టీవీ ఛానెల్ వారు ఇటీవల ప్రసారం చేశారు. వెండితెరపై ఒక రేంజ్ లో దూసుకుపోయిన ఈ సినిమా, రేటింగ్ పరంగా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకుంది. 20.16 టీఆర్పీని రాబట్టి తన ప్రత్యేకతను చాటుకుంది. బుల్లితెరపై కూడా ఈ సినిమా ఈ స్థాయి ఆదరణ పొందడం పట్ల ఈ సినిమా టీమ్ చాలా హ్యాపీగా ఫీలవుతోంది.