తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా

వాస్తవం ప్రతినిధి: తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఎపీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. వేకువజామున నిజపాదా సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అర్చకులు రతన్ టాటాకు వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.
అనంతం టీటీడీ కేటాయించిన భూమిలో టాటా ట్రస్ట్ సహకారంతో రాష్ట్రప్రభుత్వం నిర్మించబోతున్న క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి తిరుపతికి పయనం అయ్యారు.