“రోజా” కి జగన్ “ఝలక్”…..“విడుదల” కి భాద్యతలు

వాస్తవం ప్రతినిధి: ఫైర్ బ్రాండ్ అనే పేరు చెప్పగానే ముందుగా గుర్తు వచ్చేది..రాజకీయ పార్టీలలో రక్షణ కవచంలా ఉండే పెద్ద నోరేసుకుని పడిపోయే నేతలు..ఏపీలో ఫైర్ బ్రాండ్ అనగానే వైసీపీ తరుపునుంచీ అంబటి రాంబాబు గుర్తుకు వస్తారు..అయితే కాలక్రమంలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టుగా రాంబాబు హవా వైసీపీలో తగ్గటంతో రోజా ఎంటర్ అయ్యింది…ఇక రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..రోజా ఎంట్రీ తోనే టీడీపీలో మహామహులు సైతం సైలెంట్ అయిపోయారు..ఆవిడ నోట్లో పడేకంటే సైలెంట్ గా ఉండటం బెటర్ అనుకున్న నేతలు కూడా లేకపోలేదు..అయితే


వైసీపీకి అతిపెద్ద ఫైర్ బ్రాండ్ లా నిలబడిన రోజా..నగరి ప్రజలకి దూరం అవ్వడంతో..తన పదునైన వ్యాఖ్యలతో వైసీపీ భారీగా నష్టపోవడంతో..ఆమెని సొంత పార్టీ నేతలు ఏపీలో ప్రజలు ఆఖరికి తన సొంత నియోజకవర్గ ప్రజలు సైతం ఛీ కొట్టిన పరిస్థితి ఏర్పడింది..దాంతో జగన్ రోజా వల్ల వచ్చిన ద్యామేజీని పూడ్చుకోవడానికి రొజాని కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండమని ఆదేశాలు జారీచేశారు ఈ క్రమంలోనే..టీడీపీ నేతల ఎదురు దాడులకి గాను మళ్ళీ రోజా రంగంలో దిగవలసిన పరిస్థితి ఏర్పడింది..


అయితే రోజా తన వల్గర్ మాటలని కాంట్రోలో చేసుకోలేకపోవడంతో పార్టీ కి మళ్ళీ డ్యామేజ్ అవుతున్న తరుణంలో టీడీపీ నుంచీ వైసీపీ లోకి వచ్చిన ఎన్నారై మహిళ విడుదల రజనీ కుమారి ఎంట్రీ జగన్ కి ఊరటని ఇచ్చింది..దాంతో రోజాకి వైసీపీలో ఉన్న భాద్యతలని కొత్తగా వచ్చిన విడుదల రజనీ కుమారికి ఇవ్వడానికి సిద్దమయ్యాడు జగన్ మోహన్ రెడ్డి…అయితే విడుదల రజనీ కుమారి టీడీపీ తరుపున ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి..పత్తి పాటి ద్వారా చంద్రబాబు కై పరిచయం అయిన ఆమె ఏకంగా చిలకలూరి పేట పత్తిపాటి టిక్కెట్టు కే ఎసరు పెట్టిడానికి సిద్దం అయ్యింది అయితే చంద్రబాబు ససేమిరా అనడంతో వెనుతిరిగింది..

అయితే వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేసి నిలబడాలి అనుకున్న ఆమె జగన్ పంచన చేరేడమే కాదు ఏకంగా చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి..చంద్రబాబు ని యూ టర్న్ అంకుల్ అంటూ సంభోదించిన ఆమె ప్రజల పక్షాన పోరాడుతోంది కేవలం జగన్ మాత్రమే అని ప్రత్యేక హోదా జగన్ వలన మాత్రమే వస్తుందని ప్రకటించింది..దాంతో ఆమె వ్యాఖ్యలని గమనించిన జగన్ త్వరలోనే ఆమెకి రోజా భాద్యతలు అప్పగించి రొజాని తన నియోజకవర్గం మీద దృష్టి పెట్టమని చెప్పనున్నాడట..చూస్తుంటే త్వరలోనే ఆమె వైసీపీలో రోజా ని మించిపోయేలా కన్పిస్తోందని అంటున్నారు సీనియర్ నేతలు.