కర్ణాటక సీఎం కుమారస్వామితో చంద్రబాబు భేటీ

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు చేరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ దర్శనం కోసం బెజవాడ వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామితో చంద్రబాబు భేటీ అయ్యారు. ‘హోటల్ గేట్‌వే’లో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీలతో మరోసారి సమావేశం నిర్వహించే విషయం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కూడగట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. కుమార స్వామితో చంద్రబాబు భేటీ సమావేశం సందర్భంగా.. ఆయన వెంట మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉన్నారు.