దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు చేరుకున్న కుమారస్వామి

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు చేరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని ఆయన మరికొద్దిసేపట్లో దర్శించుకోనున్నారు. బెంగళూరు నుంచి విమానంలో ఆయన గన్నవరం చేరుకున్నారు. రాహుకాలంలో దుర్గమ్మను దర్శించుకుంటే అనుకున్న పనులు సిద్ధిస్తాయని కర్నాటక, తమిళనాడు ప్రజల విశ్వాసం. రాహుకు అదిదేవత దుర్గమ్మ కావడంతో… రాహు కాలంలోనే కుమారస్వామి దుర్గమ్మను కాసేపట్లో దర్శించుకోనున్నారు. కుమారస్వామి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 50 ఆలయాలను దర్శించుకున్నారు.