సంజయ్ కు బెయిల్ మంజూరు

వాస్తవం ప్రతినిధి: టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ కు బెయిల్ మంజూరైంది. నిజామాబాద్ లోని ఆయన సొంత కళాశాల ‘శాంకరి’కి చెందిన నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులు ఇటీవల ఆయన్ని అరెస్ట్ చేశారు. పందొమ్మిది రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్ కు నిజామాబాద్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న జిల్లా కోర్టు..ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.