కుల రాజకీయాలు చేసే వారికి నా పార్టీలో స్థానం లేదు: రజినీకాంత్

వాస్తవం ప్రతినిధి: అభిమానుల ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం తమ అభిమాన నటుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే . కాగా తలైవా రాజకీయాలపై మరింత స్పష్టత ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ కుల రాజకీయాలకు తాను ఆమడ దూరం ఉంటానని స్పష్టం చేశారు. కులం పేరుతో రాజకీయాలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తన పార్టీలో చేర్చుకోబోనన్నారు. తనవి ఆధ్యాత్మిక రాజకీయాలని పేర్కొన్న రజనీకాంత్.. కులమతాల పేరుతో చేసే రాజకీయాలకు తాను దూరంగా ఉంటానన్నారు. సంఘ విద్రోహ శక్తులకు తన పార్టీలో చోటుండదని తేల్చి చెప్పారు. క్రమశిక్షణతో మెలిగే వారికే తన పార్టీలో భవిష్యత్తు ఉంటుందని రజనీకాంత్ స్పష్టం చేశారు.