ప్రతిపక్ష నేతలకు టీఆర్ఎస్ ఎంపీ కవిత వార్నింగ్

వాస్తవం ప్రతినిధి: ప్రతిపక్ష నేతలకు వార్నింగ్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం… చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ఎంపీ కవిత హెచ్చరికలు జారీ చేశారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల నిధుల కంటే తక్కువ కేటాయించినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే కాంగ్రెస్ నేతలు సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల గురించి తనకు తెలియదని… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ కు ప్రజలు ఇప్పటికే 100 మార్కులు వేశారని అన్నారు.