నేటి అన్నిఅధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: దివంగత హరికృష్ణ అంత్యక్రియల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి చెన్నై పర్యటనను రద్దు చేసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంతాప సభ ఈరోజు చెన్నైలో జరుగనుంది. ఈ సభకు చంద్రబాబు వెళ్లాల్సి ఉంది. బావమరిది హరికృష్ణ అకాల మరణం నేపథ్యంలో, చంద్రబాబు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయనకు బదులుగా కేంద్ర మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు చెన్నై వెళ్తున్నారు. ఈ సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.